పంటకోత ప్రయోగంతోనే దిగుబడి అంచనా

11 Nov, 2023 04:26 IST|Sakshi
ధాన్యం తూకం వేస్తున్న సీపీఓ కృష్ణయ్య

● జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కృష్ణయ్య

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): పంటకోత ప్రయోగంతోనే దిగుబడి అంచనా సరిగా వేయొచ్చని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కృష్ణయ్య అన్నారు. శుక్రవారం చిలప్‌చెడ్‌ మండలం అంతారం గ్రామంలో ఆయన పంటకోత ప్రయోగం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రైతు అంబటి వెంకటేశం పొలంలో 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు స్థలంలో పంటను కోసి ధాన్యం తూకం వేసి దిగుబడి అంచనా వేశామన్నారు. కార్యక్రమంలో మండల గణాంక అధికారి వెంకటేశ్‌, మెదక్‌ ఎఎస్‌ఓ సురేశ్‌, రైతులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ తరఫున రెండో సెట్టు దాఖలు

కొండపాక(గజ్వేల్‌): కుకునూరుపల్లి మండలం బొబ్బాయిపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు కోల సద్గుణ శుక్ర వారం బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ అభ్యర్థి, సీఎం కేసీఆర్‌ తరుపున రెండో నామినేషన్‌ సెట్టును అందించారు.

మరిన్ని వార్తలు