ఇండోర్‌ గేమ్స్‌ను ప్రోత్సహించడం అభినందనీయం | Sakshi
Sakshi News home page

ఇండోర్‌ గేమ్స్‌ను ప్రోత్సహించడం అభినందనీయం

Published Thu, Nov 9 2023 5:58 AM

బహుమతులు పొందిన విద్యార్థులతో
మున్సిపల్‌ కమిషనర్‌ తదితరులు  - Sakshi

మున్సిపల్‌ కమిషనర్‌ జానకీరాం సాగర్‌

మెదక్‌ మున్సిపాలిటీ: టేబుల్‌ టెన్నిస్‌ లాంటి ఇండోర్‌ గేమ్స్‌ను ప్రోత్సహించడం అభినందనీయమని మెదక్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జానకీరాం సాగర్‌ పేర్కొన్నారు. బుధవారం మెదక్‌లోని గుల్షన్‌క్లబ్‌లో ఉమ్మడి జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ కం సెలక్షన్‌న్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికై న విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కొక్కొండ ప్రభు ఎంపిక పోటీలను నిర్వహించి విజేతలను ప్రకటించారు. పురుషుల విభాగంలో అనీష్‌ ప్రథమం, శ్రీనివాస్‌చారి ద్వితీయ, రవితేజ తృతీయ స్థానాల్లో గెలుపొందారు. మహిళల విభాగంలో వి.సృజన ప్రథమ, ఏ.దీపిక ద్వితీయ, సీహెచ్‌.మౌనిక తృతీయ బహుమతులను సాధించారు. బాలుర విభాగంలో వి.వర్షిత్‌, నిఖిల్‌, నరేశ్‌ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. పోటీల అనంతరం స్థానిక రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ ఆనందం, గుల్షన్‌ క్లబ్‌ సెక్రటరీ శ్యామ్‌రావు విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అథ్లెటిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మధు, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి రమేశ్‌, పీఈటీల సంఘం కార్యదర్శి శ్రీనివాస్‌, గుల్షన్‌ క్లబ్‌ సభ్యులు హనుమంతు, పీఈటీలు మమత, మహేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement