విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

11 Nov, 2023 04:26 IST|Sakshi
పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు
జిల్లా విద్యాధికారి రాధా కిషన్‌

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఈఓ రాధాకిషన్‌ అన్నారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మెదక్‌లోని గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి కళా ఉత్సవ్‌ పోటీలు నిర్వహించారు. జానపద నృత్య పోటీల(బాలుర)లో కుర్తివాడకు చెందిన విష్ణువర్ధన్‌, బాలికల విభాగంలో రేగోడ్‌ పాఠశాలకు చెందిన ధనలక్ష్మీ, శాసీ్త్రయ నృత్యంలో వెంకటలక్ష్మి(సర్దన), జానపద పాటల పోటీల్లో మనోహర్‌(కొత్తపల్లి), కీర్తన(టీఎంఆర్జేసి, మెదక్‌), శాసీ్త్రయ పాటల పోటీల్లో స్వర్ణోదయ (టీఎస్‌డబ్ల్యూ ఆర్జేసీ రామాయంపేట), చిత్రలేఖనం పోటీల్లో నాగరాజు (మోడల్‌ స్కూల్‌, రెగోడ్‌), నందిని(టీఎస్‌ఆర్జేసి, మెదక్‌), విజువల్‌ త్రీడీ పోటీల్లో యశ్వంత్‌ (వెల్దుర్తి) ప్రతిభ చూపారు. అలాగే వాయిద్యాల పోటీలలో కారుణ్య(రామాయంపేట), అభిలాష్‌ (వెల్దుర్తి), ఏకపాత్రాభినయం పోటీల్లో సారిభా(టీఎస్‌ఆర్జేసి, పెద్దశంకరంపేట) ప్రథమ స్థానాల్లో నిలిచారు. ఈ పోటీలు విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి సతీష్‌ కుమార్‌ పర్యవేక్షణలో జరిగాయి. పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయగా, వారిని డీఈఓ అభినందించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా అంజాగౌడ్‌, నర్సింగరావు, రమణ కుమార్‌, ప్రవీణ్‌, ధనుంజయచారి, నాగరాజు, శాలిని, వంశీ, శశిధర్‌, శ్రీనివాస్‌ వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్‌ వరలక్ష్మీ పాల్గొన్నారు.

ఓటు హక్కుపై అవగాహన

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర నూతన ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ రాధాకిషన్‌, జిల్లా స్వీప్‌ అధికారి రాజిరెడ్డి విద్యార్థులకు ఈవీఎం, బ్యాలెట్‌, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించారు. ఓటువేసే విధానం, బ్యాలెట్‌ పత్రం తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు.

మరిన్ని వార్తలు