హీరో ఔదార్యం.. 1000 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణం

26 Apr, 2021 17:15 IST|Sakshi

గ‌తేడాది కరోనా వైర‌స్ కార‌ణంగా విధించిన‌ లాక్ డౌన్‌లో ఎంత‌మందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌. సాయం కోసం అడిగిన ప్ర‌తి ఒక్క‌రిని ఏదో ఓక విధంగా ఆదుకున్నానే. అనేక‌మందిని త‌మ సొంతుళ్లకు చేర్చాడు. లాక్‌డౌన్‌లో మొద‌లైన త‌న సేవ‌ల‌ను ఇంకా కొన‌సాగిస్తున్నాడు.  తాజాగా సోనూసూద్ బాట‌లోనే మ‌రో నటుడు కరోనా రోగులను చూసి చలించిపోయాడు. కోవిడ్ పేషెంట్ల‌కు వైద్యం అందించే ఆసుపత్రులు తక్కువగా ఉన్నాయని ఆందోళ‌న చెందాడు. దీంతో బెడ్స్, ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న కరోనా రోగుల కోసం హాస్పిటల్ నిర్మిస్తానని నటుడు గుర్మీత్ చౌదరి ప్రకటించాడు  . పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్ళను త్వరలోనే ప్రారంభిస్తాతని ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

 ‘సామాన్య ప్రజలకు వైద్య సాయం అందించడం కోసం సకల సౌకర్యాలతో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మిస్తాను. నా ఈ ఆశయం నెరవేరేందుకు నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను’. అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు. కాగా  గతేడాది సెప్టెంబ‌ర్‌లో గుర్మీత్ చౌదరి, అతడి భార్య దెబీనా బెనర్జీ కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం కూడా చేశారు. అదే సమయంలో తన అభిమానులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. 

A post shared by Gurmeet Choudhary (@guruchoudhary)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు