‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ తీసుకోనున్న అక్షయ్‌కుమార్‌

30 Sep, 2021 07:43 IST|Sakshi

మాలీవుడ్‌ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ను బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ తీసుకోనున్నారు. మలయాళ హిట్‌ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ హిందీ రీమేక్‌లో అక్షయ్‌కుమార్‌ నటించనున్నారని లేటెస్ట్‌ టాక్‌. ఇందులో ఇమ్రాన్‌ హష్మి మరో హీరోగా నటిస్తారు. అక్షయ్‌ కుమార్‌తో ‘గుడ్‌న్యూస్‌’ చిత్రాన్ని తీసిన రాజ్‌ మెహతా ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ హిందీ రీమేక్‌ను తెరకెక్కిస్తారట. వచ్చే ఏడాది ఈ షూటింగ్‌ ఆరంభం కానుందనే ప్రచారం జరుగుతోంది.


ఈ సంగతి ఇలా ఉంచితే... మలయాళ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్, సూరజ్‌ నటించారు. ఈ చిత్రానికి జూనియర్‌ లాల్‌ డైరెక్టర్‌. తమ అభిమాన హీరోతో సెల్ఫీ దిగాలనుకున్న ఓ మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ కుటుంబం ఎలాంటి ఇబ్బందులకు లోనైంది? హీరోకి, ఇన్స్‌పెక్టర్‌కు ఈగో క్లాషెస్‌ ఎందుకొచ్చాయి? అన్నదే ఈ చిత్ర కథాంశం.

మరిన్ని వార్తలు