National Statistics: మహిళా మేనేజ్‌మెంట్‌ పొజిషన్‌లలో గ్రామీణ మహిళల హవా

30 Sep, 2021 07:43 IST|Sakshi

న్యూఢిల్లీ: సీనియర్, మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌ పొజిషన్ల(ఉద్యోగాల)లో పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌వో) ఒక నివేదికలో పేర్కొంది. 

2019–20 ఏడాదికిగాను మేనేజ్‌మెంట్‌ స్థాయి సిబ్బంది మొత్తంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళల సంఖ్య 21.5 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. ఇదే సమయంలో పట్టణాలలో ఈ సంఖ్య 16.5 శాతమేనని తెలియజేసింది.

పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం మొత్తం సీనియర్, మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌ సిబ్బందిలో పట్టణాలు, గ్రామాలలో కలిపి మహిళా వర్కర్ల నిష్పత్తి 18.8 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. 2019 జులై– 2020 జూన్‌ మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను రూపొందించింది.

చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే

మరిన్ని వార్తలు