యాంకర్‌ రవి, రాకింగ్‌ రాకేష్‌ యాడ్‌ షూటింగ్‌ కోసం భారీ సెట్టింగ్‌!

4 Jan, 2023 16:36 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయ్యాడు యాంకర్‌ రవి. ప్రస్తుతం ఈ స్టైలీష్‌ యాంకర్‌ ఓ కమర్షియల్‌ యాడ్‌లో నటించబోతున్నాడు. ‘జబర్దస్త్’ రాకింగ్ రాకేష్‌తో కలిసి నటించబోయే ఈ యాడ్‌ .. ఓ వస్త్ర వ్యాపారానికి సంబంధించినది. దీని కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ని వేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఓ సినిమా కోసం వేసేంత సెట్‌లో ఈ కమర్షియల్‌ యాడ్‌ షూటింగ్‌ జరగనుందట. 

ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్  డైరెక్ట్ చేశారు. అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం.  ఈ బ్రాండ్ ను  ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది.  ఏపీ, తెలంగాణలోని  పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం.

మరిన్ని వార్తలు