‘ఆహా’లో అలీ ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’

25 Oct, 2022 17:55 IST|Sakshi

కమెడియన్‌ అలీ, సీనియర్‌ నటుడు నరేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్‌ హిట్‌ ‘వికృతి’కి తెలుగు రీమేక్‌ ఇది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్‌, శ్రీచరణ్‌ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్‌ పళిదంను ఈ సినిమా ద్వారా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు.  

ఈ చిత్రం అక్టోబర్‌ 28న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరి వల్ల అమాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.   ఈ సినిమాలో ఆలీ హీరోగా,  నరేష్ - పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల దారులుగా నటించగా, మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

మరిన్ని వార్తలు