దండం పెడ‌తా, గేమ్ ఆడండి: నాగార్జున‌

28 Nov, 2020 23:46 IST|Sakshi

గ‌రంగ‌రంగా సాగిన బిగ్‌బాస్ ఎపిసోడ్‌

కెప్టెన్‌గా విఫ‌ల‌మైన హారిక‌!

మొద‌టగా సేఫ్ అయిన మోనాల్‌

బిగ్‌బాస్ ప్ర‌యాణం చివ‌రి మ‌జిలీకి చేరుకుంటున్న ద‌శ‌లో కొంద‌రి గ్రాఫ్ త‌గ్గుతోంటే మ‌రికొంద‌రి గ్రాఫ్ పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్‌కు గుర‌య్యే మోనాల్‌కు ఈ సారి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తుండ‌గా నాగ్ సైతం తొలుత మోనాల్‌నే సేవ్ చేయ‌డం విశేషం. ఇక హౌస్‌లో ఎవ‌రూ త‌ప్పు చేయ‌కుండా చూసుకోవాల్సిన కెప్టెన్ హారికే సరిదిద్దుకోలేని త‌ప్పులు చేసింది. దీంతో మ‌రోసారి ఇలాంటి త‌ప్పులు చేయ‌కుండా నాగ్ ఆమెకు గ‌ట్టి క్లాస్ పీకారు. అభి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఆప‌లేద‌ని, టాస్క్ చేయ‌క‌పోయినా శిక్షించ‌కుండా వెన‌కేసుకొస్తూ ఫేవెరెటిజిమ్ చూపించావ‌ని మండిప‌డ్డారు.

మోనాల్‌కు ఎప్పుడు సాయం చేశావు?
అఖిల్ కోసం సోహైల్ నామినేట్ అవడానికి రెడీగా ఉన్న‌ప్ప‌టికీ‌ నిన్ను కెప్టెన్ చేసిన మోనాల్‌ను అభి కోసం నామినేష‌న్‌లోకి పంపావ‌ని గ‌ర‌మ‌య్యారు. మోనాల్‌కు సాయం చేశావ‌ని ప‌దేప‌దే చెప్పావు కానీ ఎక్క‌డ చేశావంటూ వీడియో చూపించారు. అందులో హారిక బ‌ట్ట‌లు ప‌ట్టుకుని శిలా విగ్ర‌హంలా నిల‌బ‌డిందే త‌ప్ప మోనాల్ పేరు రాసి ఉన్న బుట్ట‌లో వేయ‌లేదు. బ‌జ‌ర్ మోగిన త‌ర్వాతే ఆమె బెడ్ ద‌గ్గ‌ర నుంచి క‌ద‌లింది, కానీ దానివ‌ల్ల ఏ ప్ర‌యోజ‌న‌మూ లేదు. ఇలా ఎన్నో త‌ప్పిదాలు చేసినందున హారిక బెస్ట్ కెప్టెన్ కాద‌ని నాగార్జున తేల్చేశారు. అరియానాను మాత్రం వ‌ర‌స్ట్ కెప్టెన్ కాద‌ని, బిగ్‌బాస్ నియ‌మాలు అంద‌రూ పాటించేలా కృషి చేసింద‌ని వెన‌కేసుకొచ్చారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఆ వీడియోలు వేసి ఇజ్జత్‌ తీయకండి)

బ‌హుశా అఖిల్‌తో స్వాప్ చేయ‌క‌పోవ‌డ‌మే నా పొర‌పాటు
త‌ర్వాత హౌస్‌లో ఈ వారం ఎవ‌రెవ‌రు ఏమేం త‌ప్పులు చేశారో చెప్ప‌మ‌ని నాగ్ ఆదేశించారు. తొలుత‌ సోహైల్ మాట్లాడుతూ‌.. త‌ను అరియానాను వెక్కిరించ‌డం త‌ప్ప‌ని చెప్తూ ఆమెకు సారీ చెప్పాడు. అలాగే దెయ్యం టాస్కులో అఖిల్‌, నేను భ‌య‌ప‌డ్డామంటూ అస‌లు నిజాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌ర్వాత అరియానా వంతు రాగా ఆమె వ‌ర‌స్ట్ కెప్టెన్ కాద‌ని గుడ్ కెప్టెన్ అని మెచ్చుకున్నారు. అవినాష్‌.. నేను వెర్రిప‌ప్ప‌లా క‌న‌ప‌డుతున్నానానా అని అరియానా మీద సీరియ‌స్ అయ్యాను అని చెప్పుకురాగా ఫ్రెండ్స్ మీద‌ నోరు జారొద్దని నాగ్ అత‌డిని హెచ్చ‌రించారు. దీంతో అవినాష్.. అరియానాను లైఫ్‌లో మ‌ర్చిపోలేని ఫ్రెండ్ అని తెలిపాడు. అలాగే శ్మ‌శానం టాస్కులో ఎక్కువ ఆలోచించడం కూడా త‌ప్పేన‌ని పేర్కొన్నాడు. మోనాల్‌.. అఖిల్‌తో స్వాప్ చేయ‌క‌పోవ‌డమే త‌న‌ పొర‌పాటు అనిపిస్తోంద‌ని తెలిపింది. చివ‌రికి క‌రెక్ట్ ప‌ర్స‌న్‌తో స్వాప్ చేయ‌మంటే హారిక.. అఖిల్‌తో కాకుండా అభితో చేసింద‌ని బాధ‌ప‌డింది. (చ‌ద‌వండి: ఇలాగైతే బిగ్‌బాస్ నుంచి త‌ప్పుకుంటా: నాగ్ వార్నింగ్‌)

మోనాల్‌తో లింక్ చేయ‌కండి: అభి
త‌ర్వాత‌ అఖిల్ మాట్లాడుతూ‌.. సీక్రెట్ రూమ్ నుంచి వ‌చ్చిన‌ప్పుడు హారిక ఐ హేట్ యూ అంటే నువ్వు ఎప్పుడు న‌న్ను ఇష్ట‌ప‌డ్డావు అని ఏదో కోపంలో అన్నాను, కానీ త‌ర్వాత సారీ చెప్పాను అని తెలిపాడు. అనంత‌రం నాగ్ బిగ్‌బాస్ హౌస్ గేట్లు తెర‌వండ‌ని చెప్పి అభి వైపు తిరిగి అత‌డిని‌ త‌ప్పుల చిట్టా చ‌ద‌మ‌న్నారు. దీంతో అభి టాస్కు చేయ‌లేద‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేశాడు. మోనాల్‌తో లింక్ చేయ‌కండ‌ని ఎన్నోసార్లు అభ్య‌ర్థించాను. పైగా దెయ్యం ఇచ్చిన టాస్క్‌లో నేను మోనాల్‌ను ఏడిపించాన‌ని చెప్పారు. కానీ నేను ఏడిపించ‌లేద‌ని చెప్ప‌డంతో నాగ్ ఓ వీడియో చూపించారు. అందులో అభిజితే మోనాల్‌ను ఏడిపించిన‌ట్లు ఒప్పుకున్నాడు. క‌ళ్లెదురుగా త‌ను మాట్లాడింది క‌నిపించడంతో అభి సారీ చెప్పాడు. (చ‌ద‌వండి: రంగంలోకి ‘ఆర్జీవీ’, వణికిపోయిన హౌస్‌మేట్స్‌)

కంటెస్టెంట్ల తీరుతో చేతులెత్తి వేడుకున్న నాగ్‌
ఇది మొద‌టిసారి కాద‌ని నాగ్ మండిప‌డటంతో అభి మోకాళ్ల మీద కూర్చుని అభ్య‌ర్థించాడు. నా సీజ‌న్‌లో మోనాల్ కోణ‌మే న‌న్ను ఇబ్బందికి గురి చేస్తోంద‌ని వివ‌రించాడు. చివ‌రాఖ‌ర‌కు టాస్కు చేయ‌క‌పోవ‌డ‌మే త‌న త‌ప్ప‌ని అంగీక‌రించ‌డంతో నాగ్‌ గేట్స్ క్లోజ్ చేయ‌మ‌న్నాడు. త‌ప్పును అంగీక‌రించ‌క‌పోతే నువ్వు బ‌య‌ట‌కు వెళ్లిపోయేవాడివ‌ని నాగ్ హెచ్చ‌రించారు. ప‌న్నెండు వారాలు ముగుస్తున్నా, ఎన్నిసార్లు హెచ్చ‌రించినా, న‌వ్వుతూ చెప్పినా ఇంకా స‌రిగా గేమ్ ఆడ‌టం లేద‌ని నాగ్ ఆవేద‌న చెందారు. మీ అంద‌రికీ దండం పెడుతున్నా, గేమ్ ఆడండి అంటూ కంటెస్టెంట్ల‌ను చేతులెత్తి వేడుకున్నారు. దీంతో సారీ సార్ అంటూ ఇంటి స‌భ్యులు బాగా ఆడ‌తామ‌ని హామీ ఇచ్చారు. త‌ర్వాత మోనాల్ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు.‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు