బిగ్‌బాస్ 4: ప్రారంభ‌మ‌య్యేది అప్పుడేనా..

23 Aug, 2020 12:56 IST|Sakshi

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు నాల్గ‌వ సీజ‌న్ గురించి గంద‌ర‌గోళం నెల‌కొంది. అస‌లు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందో ఉండ‌దో అన్న సందిగ్ధంలో ఉన్న స‌మ‌యంలోనే స్టార్ మా యాజ‌మాన్యం ప్రోమోలు వదిలి ఇంటిల్లిపాదిని అలరించేందుకు బిగ్‌బాస్ సిద్ధ‌మ‌వుతోంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేసుకోవ‌డం, వారికి క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రిపి 14 రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉంచ‌డం వంటివి షోను ఆల‌స్యం చేస్తున్నాయి. ఎట్ట‌కేల‌కు 16 మందిని ప్రాథ‌మికంగా ఎంపిక చేసిన బిగ్‌బాస్ యాజ‌మాన్యం వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం. అనంత‌రం వీళ్లంద‌రినీ క్వారంటైన్‌లో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచిన‌‌ట్లు తెలుస్తోంది. క్వారంటైన్ గ‌డువు ముగిసిన త‌ర్వాత మ‌రోసారి కోవిడ్ ప‌రీక్ష‌లు జ‌రిపి బిగ్‌బాస్ హౌస్‌కు పంపించి షో ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మ‌రోసారి మ‌న్మ‌థుడు నాగార్జునే వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అయితే ఈసారి విభిన్నంగా మూడు గెట‌ప్స్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు.

బిగ్‌బాస్ రూమ‌ర్ల‌ను ఖండించిన జానీ మాస్ట‌ర్‌
కంటెస్టెంట్ల లిస్టులో ఆది నుంచీ ఎంతోమంది సెల‌బ్రిటీల పేర్లు వినిపిస్తూ వ‌స్తున్నాయి. అయితే తాము బిగ్‌బాస్ గూటికి వెళ్ల‌ట్లేదంటూ హీరోయిన్లు శ్ర‌ద్ధాదాస్‌, పూనమ్ కౌర్, హీరో త‌రుణ్, న‌టి సున‌య‌న‌, జానీ మాస్ట‌ర్‌ తేల్చి చెప్పారు. గాయ‌ని మంగ్లీ,, జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌, సింగ‌ర్‌, న‌టుడు నోయ‌ల్‌, క‌రాటే క‌ళ్యాణి, టిక్‌టాక్ స్టార్ల‌ను ఇంట‌ర్వ్యూ చేసే యాంక‌ర్ ఆరియానా, యూట్యూబ‌ర్ మెహ‌బూబ్ దిల్‌సే, జోర్దార్ సుజాత‌, మై విలేజ్ షో స్టార్ గంగ‌వ్వ‌ పాల్గొన‌నున్నార‌ని స‌మాచారం. (బిగ్‌బాస్ 4: ఆమెకు ఎపిసోడ్‌కు ల‌క్ష‌?)

కంటెస్టెంట్ల లిస్టులో మార్పులు చేర్పులు
రెండో సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన‌ గీతామాధురి భ‌ర్త నందు ఈసారి షోలో ఎంట్రీ అవ్వ‌నున్న‌ట్లు ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అలాగే కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు- ప్ర‌ణ‌వి జంట‌ను కూడా తీసుకురానున్నాన్న‌ర‌న్న వార్త వైర‌ల్ అవుతోంది. కానీ వీరికి చిన్న పాప ఉండ‌టంతో బ‌హుశా అది కుద‌ర‌క‌పోవ‌చ్చ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాగే మ‌రో సీరియ‌ల్ న‌టుడిని, ఓ యాంక‌ర్‌ను కూడా తీసుకున్నారు. ఆ యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లి అని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఈ లిస్టులో వారి ఆరోగ్య ప‌రిస్థితిని బ‌ట్టి చివ‌ర్లో మార్పులు చేర్పులు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ షో ఆగ‌స్టు 30న ప్ర‌సార‌మ‌వనున్న‌ట్లు స‌మాచారం. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు వేచి చూద్దాం.. (బిగ్‌బాస్ 4: కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు