హీరో విక్ర‌మ్ ఇంటికి బాంబు బెదిరింపులు

30 Nov, 2020 20:57 IST|Sakshi

చెన్నై: త‌మిళ హీరోల ఇళ్ల‌ల్లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్స్ రావ‌డం ఇటీవ‌లి కాలంలో మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఇలాంటి ఆగంత‌కుల‌కు పోలీసులు ఎంత బుద్ధి చెప్పినా వారు తీరు మార్చుకోవ‌డం లేదు. తాజాగా ప్ర‌ముఖ నటుడు చియాన్ విక్ర‌మ్ నివాసానికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. సోమ‌వారం నాడు ఓ ఆగంత‌కుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెన్నైలోని హీరో విక్ర‌మ్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు బెదిరించారు. దీంతో పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌తో స‌హా హుటాహుటిన‌ ఆయ‌న ఇంటికి చేరుకుని సోదాలు నిర్వ‌హించారు. అంగుళం అంగుళం జ‌ల్లెడ ప‌ట్టినా బాంబు ఆన‌వాళ్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఎవ‌రో ఆగంత‌కుడు బెదిరింపు కాల్స్ సిన‌ట్లు ధృవీకరించారు. అత‌డు విల్లాపురం నుంచి కాల్ చేసినట్లు గుర్తించారు. ప్ర‌స్తుతం పోలీసులు అత‌డిని ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. (చ‌ద‌వండి: కోబ్రాతో సంబంధం ఏంటి?)

గ‌తంలో‌ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి నివాసానికి కూడా ఓ మాన‌సిక రోగి బాంబు పెట్టానంటూ బెదిరించిన విష‌యం తెలిసిందే.  ఇక విక్ర‌మ్ సినిమాల విష‌యానికొస్తే.. ఆయ‌న రాజేశ్ ఎమ్ సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'క‌ద‌రం కొండాన్' సినిమాలో చివ‌రి సారిగా క‌నిపించారు. ప్ర‌స్తుతం 'కోబ్రా'లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ర‌ష్యాలో చిత్రీక‌రించాల్సి ఉంది. అయితే అక్క‌డ కోవిడ్ కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో షూటింగ్ వాయిదా వేశారు. అజ‌య్ జ్ఞాన‌ముత్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కోబ్రా చిత్రంలో మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌తో పాటు న‌టీన‌టులు శ్రీనిధి శెట్టి, కెఎస్ ర‌వికుమార్‌, బాబు ఆంథోనీ, రోష‌న్ మాథ్యూ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. (చ‌ద‌వండి: ధనుష్‌, విజయ్‌ కాంత్‌ ఇళ్లలో బాంబు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా