అవును ఖుషీ ఎంట్రీ త్వరలోనే: బోనీ కపూర్‌

19 Jan, 2021 12:06 IST|Sakshi

ముంబై: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. కూతురిని హీరోయిన్‌గా చూడాలన్నది శ్రీదేవి కోరిక. అనుకున్నట్లుగానే పెద్ద కూతురిని హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసింది శ్రీదేవి. ఇక తాజాగా ఆమె రెండో కూతురు ఖుషీ కపూర్‌ కూడా త్వరలో నటిగా ఏంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఖుషీ ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందా అని శ్రీదేవి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఈ క్రమంలో ఆమె త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుందంటూ కొంతకాలంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఖుషీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ సైతం త్వరలోనే ఖుషీ నటిగా ఆరంగ్రేట్రం చేయనుందని స్పష్టం చేశాడు. అయితే ఖుషీని మొదట పరిచయం చేసేది మాత్రం తాను కాదని పేర్కొన్నాడు. ఓ ఇంటర్య్వూలో బోనీ కపూర్‌ మాట్లాడుతూ.. ‘ఖుషీని సినిమాల్లో పరిచయం చేయడానికి నా దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. (చదవండి: ఆ విషయంలో నన్ను ఎక్కిరించేవారు: ఖుషీ కపూర్‌)

అయితే తనని మాత్రం మొదట పరిచయం చేసే వ్యక్తిని నేను కాదు. ఓ నిర్మాతగా నాకు, నటిగా తనకు ఇది మంచిది కాదు. ఎందుకంటే ఓ తండ్రిగా ఖుషీ తన సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ఖుషీ కూడా సోషల్‌ మీడియాలో వరుసగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేస్తుండటంతో ఆమె ఎంట్రీ తర్వలోనే ఉందని నెటిజన్‌లు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రైవసీలో ఉన్న తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌ను తాజాగా ఖుసీ పబ్లిక్‌ చేసింది. అనంతరం హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకోవడం ప్రారంభించింది. అవి చూసిన ఆమె ఫాలోవర్స్‌, నెటిజన్‌లు వెండితెరపై కనిపించేందుకు ఖుషీ సిద్దమైందని, ఆమె ఎంట్రీ త్వరలోనే ఉండనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఖుషీ లండన్‌లో ఫిలీం స్కూల్‌లో యాక్టింగ్‌ ట్రైనింగ్‌ తీసుకుంటుందని, త్వరలోనే తను నటిగా మీ ముందుకు వస్తుందని పలు ఇంటర్య్వూలో జాన్వీ కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: మా పిల్లలు ప్రతిభావంతులు)

A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు