ఎన్టీఆర్‌కు కరోనా.. హెల్త్‌ అప్‌డేట్స్‌ ఇచ్చిన చిరంజీవి

12 May, 2021 14:15 IST|Sakshi

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌రోనా బారిన‌ పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లోకి ఉండి చికిత్స పొందుతున్నాడు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైల్‌లోకి వెళ్లారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నామని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. అయినప్పటీకి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఎన్టీఆర్‌ హెల్డ్‌ అప్‌డేట్స్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ని కూల్‌ చేశాడు మెగాస్టార్‌ చిరంజీవి.

ఎన్టీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడానని, ఆయన ఆరోగ్యంగా బాగానే ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అత‌ను, వారి కుటుంబ స‌భ్యులు క్షేమంగా ఉన్నారు .తను చాలా ఉత్సాహంగా, ఎన‌ర్జిటిక్‌గా ఉన్నారని తెలుసుకుని నేను చాలా సంతోషించాను .త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ తార‌క్’ అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

చదవండి:
TNR ఫ్యామిలీకి ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్థిక సాయం 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు