అల్లు రామలింగయ్య జయంతి; చిరు భావోద్వేగం

1 Oct, 2020 16:42 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుత స్థాయిలో కామెడి పండించిన హాస్యపు రారాజు అల్లు రామలింగయ్య. వెండితెరపై ఆయన పూయించిన నవ్వుల జల్లు ఎల్లకాలం గుర్తిండిపోతుంది. హాస్యానికి చిరునామా అయిన అల్లు రామ‌లింగ‌య్య 99వ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా అల్లు రామ‌లింగ‌య్యకు తమ కుటుంబ‌స‌భ్యులు ఘ‌నంగా నివాళి అర్పించారు. ఆయన జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అల్లు అర‌వింద్ కుటుంబం అల్లు రామ‌లింగ‌య్య పేరు  మీదుగా అల్లు స్టూడియోస్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హైద‌రాబాద్ లోని గండిపేట్ ప్రాంతంలో 10 ఎక‌రాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు అల్లు అర‌వింద్ తోపాటు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ పేర్కొన్నారు.. చదవండి: 'అల్లు' స్టూడియోస్ ప్రారంభం

అదే విధంగా అల్లు రామలింగయ్య జయంతి రోజును పురస్కరించుకొని మెగాస్టార్‌ చిరంజీవి ఆయన్ను మరోసారి స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో  సోషల్‌ మీడిదయాలో భావోద్వేగ పోస్టు చేశారు. రామలింగయ్య కేవలం తనకు మామయ్య మాత్రమే కారని గొప్ప వ్యక్తి, డాక్టర్‌, స్వాతంత్ర్య సమరయోధుడు అని గుర్తు చేసుకున్నారు. ‘ఆయన పేరు గుర్తుకు రాగానే అందరి పెదాలపైన చిరునవ్వు మెదులుతుంది. మామయ్య గారు కేవలం అందరిని మెప్పించిన నటుడే కాదు. తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి డాక్టర్‌ కూడా. తత్వవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, నాకు మార్గదర్శి, గురువు, అన్నింటికి మించి మనసున్న మనిషి. ఈ 99వ పుట్టినరోజు నాడు ఆయన శత జయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను.’ అని మెగాస్టార్‌ ట్వీట్‌ చేశారు. (భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా