సూర్య 40: మంచి కిక్‌ ఇచ్చే మాస్‌ టైటిల్‌, త్వరలో వెల్లడి

9 Jun, 2021 08:59 IST|Sakshi

సాక్షి, చెన్నై: సూర్య హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 35 శాతం పూర్తయిందని పాండిరాజ్‌ వెల్లడించారు. ఈ సినిమా గురించి ఇంకా పాండిరాజ్‌ మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే చిత్రీకరణను తిరిగా ప్రారంభిస్తాం త్వరలో ప్రీ లుక్‌తో పాటు టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది. సూర్య అభిమానులకు కిక్‌ ఇచ్చేలా టైటిల్‌ మాసీగా ఉంటుంది. వచ్చే నెలలో మరిన్ని అప్‌డేట్స్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చెన్నైలో ప్రారంభం కానుంది. ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు. కోవిడ్‌ ఆటంకాలు లేకుండా అనుకున్న ప్రకారం షూటింగ్‌ జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

చదవండి: 
‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’

మరిన్ని వార్తలు