Sitaramam OTT Release Date: 'సీతారామం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అప్పుడు.. స్ట్రిమింగ్‌ ఎప్పుడంటే

5 Sep, 2022 10:19 IST|Sakshi

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. రష్మిక మందన్నా, సుమంత్‌,తరుణ్‌ భాస్కర్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజు నుంచే హిట్‌టాక్‌ను సొంతం చేసుకొని సుమారు రూ. 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇటీవలె హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ సంస్థ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు