డెంటల్‌ డాక్టర్‌ను పెళ్లాడిన 'సాహో' భామ

8 Jun, 2021 01:39 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఎవెలిన్‌ శర్మ వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన దంతవైద్యుడు తుషన్‌ బిండీతో ఎవెలిన్‌ పెళ్లి జరిగింది. 2019లో నిశ్చితార్థం చేసుకున్న తుషన్, ఎవెలిన్‌ అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో కోవిడ్‌ నియమ నిబంధనలతో ఈ ఏడాది మే 15న బ్రిస్బేన్‌లో వివాహం చేసుకున్నారు. తాజాగా తన పెళ్లి ఫొటోలను ఎవెలిన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘నన్ను బాగా అర్థం చేసుకున్న నా బెస్ట్‌ ఫ్రెండ్‌  నా జీవితభాగస్వామి అయ్యారు. మేం ఇద్దరం కలిసి భార్యాభర్తలుగా జీవిస్తున్నందుకు చాలా హ్యాపీ. న్యూ లైఫ్‌.. న్యూ స్టార్ట్‌’’ అని పేర్కొన్నారు ఎవెలిన్‌. ‘ఏ జవానీ హై దీవాని, మై తేరా హీరో, జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ వంటి హిందీ చిత్రాల్లో నటించారు ఎవెలిన్‌. అలాగే ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’లో ఎవెలిన్‌ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు