‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కు సెన్సార్ పూర్తి

17 Aug, 2021 18:23 IST|Sakshi

సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది.  ఈ మూవీ ఆగస్ట్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌వుతుండ‌టంతో మేక‌ర్స్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.
(చదవండి: వైష్ణవ్‌ తేజ్‌, క్రిష్‌ సినిమా: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. టైటిల్‌ అదేనా!)

ఫ్రెష్ కంటెంట్‌, యాక్ష‌న్‌, రొమాన్స్ స‌హా ఇత‌ర అంశాల‌తో ఇచ్చ‌ట వాహ‌న‌ములు చిత్రాన్ని కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించిన చిత్ర యూనిట్‌ను సెన్సార్ స‌భ్యులు అభినందించారు.  ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించారు. 
 

మరిన్ని వార్తలు