ఉప్పెన పెద్ద విజయం సాధించాలి

5 Feb, 2021 05:49 IST|Sakshi
కృతీ శెట్టి, ఎన్టీఆర్, వైష్ణవ్‌ తేజ్, బుచ్చిబాబు, రవిశంకర్‌

‘‘ఉప్పెన’ ట్రైలర్‌ చాలా బాగుంది. సినిమా కూడా అంతే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధించాలి’’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. పంజా వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని జూనియర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేశారు. బుచ్చిబాబు సానా మాట్లాడుతూ –‘‘ఈ కథను నేను మొదటగా చెప్పింది ఎన్టీఆర్‌గారికే. ఈ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఫోన్‌ చేసి ఎలా వస్తోంది? అని అడిగేవారు. కథ విని ఆయన ఇచ్చిన ఎనర్జీతో ఈ కథని చిరంజీవి, విజయ్‌ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్‌గార్లకు కూడా చెప్పాను. అందమైన, ఉద్వేగభరితమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈవో: చెర్రీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అనిల్‌ వై, అశోక్‌ బి.

మరిన్ని వార్తలు