కత్రినా ఎంగేజ్‌మెంట్‌! సారీ సల్మాన్ ఖాన్‌ అంటూ పోస్టులు

19 Aug, 2021 09:56 IST|Sakshi

కత్రినా- విక్కీ కౌశల్‌ ఎంగేజ్‌మెంట్‌ రూమర్స్‌పై క్లారిటీ..

Katrina Kaif -Vicky Kaushal: బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారంటూ కొంత కాలంగా బీటౌన్‌ మీడియా కోడై కూస్తుంది. కానీ తాజాగా జరిగిన రోకా ఫంక్షన్‌లో కత్రినా- విక్కీ ఉంగరాలు మార్చుకున్నారంటూ ఓ వార్త తెగ వైరల్‌ అవుతుంది.దీంతో నెటిజన్ల నుంచి వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ‘ఫీలింగ్ సారీ ఫర్ సల్మాన్ ఖాన్’ అంటూ మరికొందరు నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు షేర్‌ చేస్తున్నారు. కత్రినా-విక్కీ ఎంగేజ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తుండటంతో ఆమె టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది. 'రోకా వేడుక జరిగిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కత్రినా అతి త్వరలోనే ‘టైగర్‌-3’ షూట్‌ కోసం విదేశాలకు వెళ్తున్నారు' అని పేర్కొన్నారు.


కాగా దాదాపు రెండేళ్లుగా విక్కీ-కత్రినా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. న్యూఇయర్‌ పార్టీకి మాల్దీవులకు వెళ్లడం, కలిసి ప్రైవేటు పార్టీలు, వేడుకల్లో పాల్గొనడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఓ షోలో సోనమ్ కపూర్ సోదరుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ కూడా కత్రినా-విక్కీ కౌశల్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చాడు. దీంతో ఇక వీరు ఏడడుగులు వేయడమే తరువాయి అంటూ బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. 

చదవండి : 
katrina kaif : కత్రినా కైఫ్‌ పెళ్లిపై సల్మాన్‌ ఖాన్‌ మేనేజర్‌ హింట్‌

లవ్‌ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం

మరిన్ని వార్తలు