కేబీసీలో దీపికా, ఫరా సందడి మామూలుగా లేదుగా!

7 Sep, 2021 11:38 IST|Sakshi

సాక్షి, ముంబై:  హిందీలో పాపులర్‌ రియాల్టీ షో  ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ హవా మామూలుగా  లేదు. బాలీవుడ్‌  సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా ఉన్న  ఈ షో  ప్రస్తుత సీజన్‌లో ​కూడా అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతోంది. కౌన్‌ బనేగా కరోడ్‌ పతి సీజన్‌-13లో రానున్న ఎపిసోడ్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌, న్యత్య దర‍్శకురాలు ఫరా ఖాన్‌ సందడి చేయనున్నారు.

ముఖ్యంగా రానున్న గణేష్ చతుర్థి సందర్భంగా (శుక్రవారం, సెప్టెంబరు 10) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో దీపికా, ఫరా ఖాన్‌ ఈ షోలో హంగామా చేయనున్నారు. తనదైన శైలిలో ఫరా పంచ్‌లు విసురుతోంటే దీపిగా పగలబడి నవ్వుతూ అభిమానులకు కనువిందు చేసింది. ఈ సందర్భంగా అమితాబ్‌ హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

చదవండి :  బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం

అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్యక్రమంలో మ్యూజికల్‌ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ ఫైనలిస్టు తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ,  విన్నర్‌ పవన్‌ దీప్ రాజన్, అరుణితా కంజిలాల్ తమ మ్యూజికల్‌ ట్రీట్‌తో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్‌ చేశారు. అలాగే పవన్‌ దీప్‌ కూడా దీన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రానున్న ఎపిసోడ్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌  చేస్తున్నారు.

చదవండి :  కోటి రూపాయలను తలదన్నే కథ

A post shared by Pawandeep Rajan (@pawandeeprajan)

మరిన్ని వార్తలు