చెక్‌ ఎవరికి?

2 Oct, 2020 02:23 IST|Sakshi
‌రకుల్‌ ప్రీత్‌ సింగ్, నితిన్

నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘చెక్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి. ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను, ప్రీ లుక్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు.

ఈ సినిమా గురించి ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నితిన్‌ విశ్వరూపం చూస్తారు. సినిమాలో ఎవరు ఎవరికి చెక్‌ పెడతారన్నది సస్పెన్స్‌’’ అన్నారు. ‘‘ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్‌ కనిపిస్తారు. చదరంగం నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అన్నారు చంద్రశేఖర్‌ యేలేటి. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, సాయిచంద్, సంపత్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్‌ ఈ నెల 12న ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు