Not Released In OTT: ఓటీటీల్లో సూపర్ హిట్ మూవీస్.. ఆ మూడు చిత్రాలు నో ఎంట్రీ!

20 Nov, 2023 13:54 IST|Sakshi

ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఓటీటీలదే హవా. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు అభిమానులు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే.. ఏ ఓటీటీలో వస్తుంది? ఏ రోజు స్ట్రీమింగ్‌ ‍అవుతుందని తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సైతం నెల తర్వాతే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజై నెలల గడుస్తున్నా కొన్ని సినిమాలు ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవీ? ఎందుకు రాలేదు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. 

అఖిల్ ఏజెంట్‌…

అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఏప్రిల్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సోనీ లివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 


అసలు కథేంటంటే?

రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష‍్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్‌లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్‌.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా?  అన్నదే 'ఏజెంట్' స్టోరీ. 


న‌య‌న‌తార క‌నెక్ట్‌…

లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం క‌నెక్ట్. థియేట‌ర్ల‌లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో థ్రిల్ల‌ర్‌ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా గ‌తేడాది డిసెంబ‌ర్‌లో థియేట‌ర్లలో విడుద‌లైంది. న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ఈ మూవీని నిర్మించాడు. క‌నెక్ట్ ఓటీటీ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ సినిమా మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీ రిలీజ్ కాలేదు.


ఆదా శర్మ.. ది కేర‌ళ స్టోరీ

ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  ఈ చిత్రం రిలీజ్ నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓటీటీకి రావడం లేదు. సెన్సిటివ్ కంటెంట్ కావ‌డంతోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు