రకుల్‌ ఫిజిక్‌పై నెటిజన్ల సెటైర్లు..మరీ అస్థిపంజరంలా..

19 Jul, 2021 12:36 IST|Sakshi

“వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్” సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్‌. అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ తెలుగులో దాదాపు స్టార్‌ హీరోలందరితో జతకట్టింది. కొన్నాళ్లుగా పరాజయాలు పలకరించడంతో ఈ అమ్మడు బాలీవుడ్‌కి మకాం మార్చింది. ఇక ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై రకుల్‌కు ఉన్న శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొంతకాలంగా రకుల్‌ శరీరాకృతిలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


నిత్యం భారీ వర్కవుట్లు చేస్తూ మరీ సన్నగా మారిపోయింది. ఇది వరకు కాస్త బొద్దుగా చాలా అందంగా ఉన్న రకుల్‌  ఈ మధ్య జీరో సైజ్‌లోకి మారిపోయింది. దీంతో నెటిజన్లు రకుల్‌ను ఆడేసుకుంటున్నారు. తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఓ ఫోటో చూసి తెగ ట్రోల్‌ చేసేస్తున్నారు. 'ఏమొచ్చింది మరీ అస్థిపంజరంలా ఇలా అయిపోయావేంటి' అంటూ రకుల్‌ ఫిజిక్‌పై కామెంట్లు చేస్తున్నారు. ఎలా ఉండేదానివి..ఎలా అయిపోయావ్‌  అంటూ మరికొందరు రకుల్‌ ఫోటోపై చేసిన మీమ్స్‌ ఇప్పుడు నెట్టింట హల్‌చేల్‌ చేస్తున్నాయి. 

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని వార్తలు