గాయకుడు మాణిక్య వినాయకం కన్నుమూత.. సీఎం స్టాలిన్‌ నివాళి 

28 Dec, 2021 07:11 IST|Sakshi
నివాళులర్పిస్తున్న సీఎం స్టాలిన్‌  

Tamil Singer Manicka Vinayagam Passes Away: ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయకం ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఈయన వయసు 78 ఏళ్లు. సంగీత కుటుంబంలో జన్మించిన ఈయన సొంత ఊరు మైలాడుదురై సమీపంలోని వళువూర్‌ గ్రామం. భరత నాట్య కళాకారుడు వళువూర్‌ రామయ్య పిళ్లై ఈయన తండ్రి. తన మామ సితార వాయిద్య కళాకారుడు సీఎస్‌.జయరామన్‌ వద్ద మాణిక్య వినాయకం సంగీతాన్ని నేర్చుకున్నారు. ఈయన 2001లో దిల్‌ చిత్రం ద్వారా గాయకుడిగా సినీరంగ  ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సంగీత ప్రియులను అలరించారు. 2002లో తిరుడా తిరిడి చిత్రం ద్వారా నటుడిగానూ పరిచయమయ్యారు. ఈయన 200కు పైగా చిత్రాల్లోనూ, అనేక భక్తి గీతాలు పాడి పేరు తెచ్చుకున్నారు. స్థానిక అడయార్‌లోని శాస్త్రీనగర్‌లో నివసిస్తున్న అనారోగ్యం కారణంగా ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 

ముఖ్యమంత్రి  స్టాలిన్‌ నివాళి 
మాణిక్య వినాయకం మృతికి గాయని చిత్ర, దర్శకుడు శీనూరామసామి తదితరులు ట్విట్టర్‌ ద్వారా సంతాపాన్ని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ సోమవారం మాణిక్య వినాయకం ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. సీఎం వెంట పాటు మంత్రి సుబ్రమణియన్‌ తదితరులు ఉన్నారు. మాణిక్య వినాయకం భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం అడయార్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  

చదవండి: (ఈ ఏడాది చివరి వారంలో వచ్చే సినిమాలు ఇవే..)

మరిన్ని వార్తలు