Salaar Leaked Video: క్యాజువల్‌ లుక్‌లో ప్రభాస్‌.. వీడియో వైరల్‌

12 Aug, 2021 09:57 IST|Sakshi

ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్‌’. ఇందులో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా సలార్ షూటింగ్ స్పాట్‌ లో ప్రభాస్ కి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో లీకైంది. ఇక ఇది సినిమాలో సన్నివేశానికి సంబంధించినది కాదు కానీ సాలార్ షూటింగ్ స్పాట్‌లో ప్రభాస్‌కు సంబంధించినది. ఈ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అయితే ఈ వీడియో లేటెస్ట్ వీడియోనా? కాదా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం మేకర్స్ ఓ మాస్ సాంగ్ ను షూట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, అందుకోసం సన్నాహాలు మొదలు పెట్టారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదలకానుంది. 

మరిన్ని వార్తలు