అప్పుడు నేను ఏం ధరించాను? : ప్రియాంక

24 Jul, 2020 17:14 IST|Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు. వినోద రంగంలోకి తాను అడుగుపెట్టి 20 ఏళ్లు పూరైన తరుణంలో.. ఇది వేడుక జరుపుకోవాల్సిన సమయని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తన ప్రయాణంలోని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నట్టు తెలిపారు. ఈ జర్నీలో తన పక్షాన నిలవడం, మద్దతు అందించడం ఎంతో విలువైనదని కూడా చెప్పారు. అందులో భాగంగా 18 ఏళ్ల వయసులో మిస్‌ ఇండియా 2000 విజేతగా నిలిచిన అద్భుతమైన క్షణాల్ని ప్రియాంక గుర్తుచేసుకున్నారు. (పవర్‌ స్టార్‌పై అంచనాలు పెంచుతున్న ఆర్జీవీ)

ఆ సమయంలో తన డ్రెస్సింగ్‌, హెయిర్‌‌, స్టేజ్‌పై తాను చెప్పిన సమాధానాలు.. ఇలా పలు అంశాల గురించి వివరించారు. మిస్‌ ఇండియా పోటీలకు సంబంధించిన చిన్నపాటి వీడియోను కూడా షేర్‌ చేశారు. ‘నేను మిస్‌ ఇండియా 2000 పోటీలో నా వీడియోను చూస్తున్నాను. ఇదంతా జరగడాని అదే మూలం. ఒకవేళ మీరు ఇంతకు ముందు ఈ వీడియో చూసి ఉండకపోతే.. ఇది మీకు కొంత ట్రీట్‌ లాంటింది’ అని పేర్కొన్నారు. 

ప్రియాంక మిస్‌ ఇండియా వేదికపై ఏ దుస్తులు ధరించానో గెస్‌ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు తనకు చాలా హెయిర్‌ ఉండేదని అన్నారు. కానీ అది ఎప్పుడూ కోల్పోయానో తెలియదని అన్నారు. మిస్‌ ఇండియా స్టేజిపై ఎదురైన ప్రశ్నకు చాలా బాగా సమాధానం చెప్పానని.. తన తెలివిపై తానే ప్రశంసలు కురిపించుకున్నారు.  తనను విజేతగా ప్రకటించిన క్షణాలను చూసుకుని మురిసిపోయారు. అలాగే తనకు 16 ఏళ్ల వయసులో దిగిన ఫొటోలను కూడా షేర్‌ చేశారు. ఈ అడుగే.. నన్ను హాలీవుడ్‌ వరకు తీసుకెళ్లిందని చెప్పారు. (కంగనకు సమన్లు జారీ చేసిన ముంబై పోలీసులు)

‘ఇది చాలా క్రేజీ. నేను గెలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు. దీంతో ఇది అయినా వెంటనే తిరిగి వెళ్లి బోర్డు ఎగ్జామ్స్‌ రాయడానికి.. ట్రైన్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాను. కానీ నన్ను ఆ కిరీటం వరించింది. ఇది చాలా క్రేజీ. 20 ఏళ్లు గడిచిపోయాయి... ఇప్పటివరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అని  ప్రియాంక ఆ వీడియోలో పేర్కొన్నారు.

Alright guys, we’re doing this! I’m watching footage from my Miss India pageant in 2000! This is where it all began... If you’ve never seen these before, you are in for quite a treat. 😅 #20in2020 @missindiaorg

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు