తల్లి పాలు డొనేట్‌ చేస్తున్న బాలీవుడ్‌‌ నిర్మాత

19 Nov, 2020 16:11 IST|Sakshi

పిల్లలకు తల్లి పాలు ఎంతో అవసరం. డబ్బా పాల కంటూ అమ్మ పాలు ఎంతో బలాన్ని, మంచి ఆరోగాన్ని అందిస్తాయి. అయితే చాలా మంది తల్లులు కొన్ని కారణాల వల్ల తమ పిల్లలకు పాలు ఇవ్వలేకపోతున్నారు. ఈ ప్రభావం పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై కచ్చితంగా పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఓ బాలీవుడ్‌ నిర్మాత తన చనుబాలను తల్లి పాలకు దూరమైన చిన్నారులకు అందించేందుకు ముందుకు వచ్చారు. అలాగే తల్లి పాల ఆవశ్యకతను చెప్పుకొస్తున్నారు. సాంద్‌‌ కీ ఆంక్‌ సినిమాకు నిర్మాతగా పనిచేసిన 42 ఏళ్ల నిధి పర్మార్‌ హిరా నందిని ఈ ఏడాది ఫిబ్రవరిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే నిధికి పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. తన కొడుక్కి పాలు పట్టిన తరువాత కూడా పాలు మిగులుతుండటంతో వాటిని వృథా చేయకూడదని అనుకున్నారు. చదవండి: టాప్‌ ఫామ్‌లో ఉన్నావ్‌.. మహేష్‌ ప్రశంసలు

తల్లి పాలను ఫ్రీజ్‌లో సరిగా స్టోర్‌ చేస్తే మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంచవచ్చని గ్రహించారు. దీంతో ఎక్కువైన పాలను పాలు దొరక్క ఇబ్బంది పడుతున్న చిన్నారులకు అందించాలని నిర్ణయించుకున్నారు. తన పాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలా చేయాలన్న విధానంపై తీవ్రంగా ఆలోచించారు. ఇందుకోసం అనేక మందిని ఇందుకు సంబంధించిన వివరాలను అడగ్గా.. అమెను అందరూ ఎగతాళి చేశారు. ఎవరూ సరైన వివరాలు చెప్పలేదు. దీంతో ఆన్‌లైన్‌లో డొనేషన్ సెంటర్ల వివరాలను తెలుసుకున్నారు. చివరకు ముంబైలోని సూర్య హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులోని పిల్లల కోసం తన పాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. చదవండి: వైరల్‌: ‘సామ్‌ జామ్‌’లో మెరిసిన మెగాస్టార్‌..

42 లీటర్ల పాలు డొనేట్‌‌
మార్చి నెల నుంచి ఇప్పటివరకు హిరానందిని నలభై రెండు లీటర్ల వరకు తల్లి పాలను డొనేట్ చేశారు. తన పాలు అందించిన పిల్లల్లో ప్రీమెచ్యూర్ బేబీస్, బరువు తక్కువగా పుట్టిన చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఓ సారి స్వయంగా ఆమె తన పాలు తాగే చిన్నారులు ఎలా ఉన్నారో చూడడం కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఆ చిన్నారులను స్వయంగా చూసిన తర్వాత ఆమె తన చనుబాలను మరో ఏడాది పాటు డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయంపై నిధి మాట్లాడుతూ.. నా బిడ్డకు పాలు పట్టిన కూడా నాకు చాలా పాలు మిగిలాయి. వాటిని నేను ఎందుకైనా ఉపయోగించుకోవాలనుకున్నాను. నా స్నేహితులను అడిగితే.. ఆభరణాల తయారీ, ఫేస్‌ ప్యాక్‌, స్క్రబ్ వంటి సలహాలు ఇచ్చారు. కానీ నేను అందుకు ఇష్టపడలేదు. తరువాత నెట్‌లో శోధించి.. ఒక గైనకాలజిస్టు ద్వారా ముంబైలోని ఓ ఆసుపత్రిలో తల్లి పాలు డొనేట్‌ చేస్తారని తెలుసుకున్నాను. వెంటనే అప్పటి నుంచి 40 లీటర్లకు పైగా పాలు దానం చేశాను. ఇంత మంది పిల్లలకు పాలు అందించడం గొప్పగా ఫీల్‌ అవుతున్నాను’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు