వేసవిలో హీరోయిన్‌ రకుల్‌ తాగే డ్రింక్‌ ఇదే..‌

21 Apr, 2021 08:21 IST|Sakshi

అసలే వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. వేడి తట్టుకోడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, నిమ్మ రసం, పుదీనా రసం వంటి ద్రావణాలను తీసుకుంటుంటారు. ఇవన్నీ ఓకే.. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇంకోటి కూడా చెబుతున్నారు. ‘‘ఈ వేసవి తాపంలో శరీరానికి బార్లీ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి’’ అంటున్నారామె. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం యోగా, జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు రకుల్‌. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటారు.

తాజాగా ఎండ వేడి నుంచి చల్లబడటానికి రకుల్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘వేసవి తాపాన్ని ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే బార్లీ నీళ్లు బెస్ట్‌. ఈ ద్రావణాన్ని నా న్యూట్రిషనిస్ట్‌ సూచించారు. వేసవిలో వచ్చే ఆరోగ్య, జీర్ణ సమస్యలన్నింటినీ బార్లీ ద్రావణం దూరం చేస్తుంది. చోటా నామ్‌ (బార్లీని ఉద్దేశించి) బడా కామ్‌ (పేరు చిన్నదే అయినా పని పెద్దది)’’ అని చెప్పుకొచ్చారు రకుల్‌. పేరు చిన్నదే అయినా బాగా మేలు చేస్తుందన్నది రకుల్‌ ఉద్దేశం. రకుల్‌ చెప్పినట్లు బార్లీ వాటర్‌ తీసుకుంటే కూల్‌ అయిపోవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు