‘ర‌ణబీర్ ఓ రేపిస్ట్‌, దీపిక ఒక‌ సైకో’

11 Aug, 2020 15:23 IST|Sakshi

హీరోయిన్‌ కంగ‌నా ర‌నౌత్‌ బాలీవుడ్ సెల‌బ్రిటీలంద‌రినీ ఓ ర‌కంగా ఆడేసుకుంటోంది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మ‌ర‌ణం త‌ర్వాత ఆమె సెల‌బ్రిటీల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శించ‌డం తీవ్ర‌స్థాయికి చేరింది. బాలీవుడ్‌లో నెపోటిజం వేళ్లూనుకుపోయిందంటూ, ప్ర‌తిభ ఉన్న వాళ్ల‌కు ప్రాధాన్యం ఉండ‌ద‌ని, కేవలం స్టార్ కిడ్స్‌కు మాత్ర‌మే అవ‌కాశాలు, అవార్డులు ఉంటాయ‌ని ఆమె గ‌తంలో విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, హీరోయిన్లు తాప్సీ, స‌ర్వ భాస్క‌ర్‌ల‌పై విరుచుకు ప‌డిన ఆమె తాజాగా స్టార్ సెల‌బ్రిటీలు ర‌ణ్‌బీర్ క‌పూర్‌, దీపికా ప‌దుకొనేల‌ను టార్గెట్ చేశారు. (సోషల్‌ మీడియా పోస్టు: కంగనా, చందేల్‌పై ఫిర్యాదు)

ర‌ణ‌బీర్‌కు స్త్రీ వ్యామోహం ఉంద‌ని, దీపిక ఓ మాన‌సిక వ్యాధిగ్ర‌స్తురాల‌ని టీమ్ కంగ‌నా ర‌నౌత్‌ సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. "అమ్మాయిల వెంట ప‌డే ర‌ణ‌బీర్‌ను ఎవ‌రూ రేపిస్ట్ అని పిలిచే ధైర్యం చేయ‌రు. త‌న‌ను మాన‌సిక‌ రోగిగా ప్ర‌క‌టించుకున్న దీపిక‌ను ఎవ‌రూ సైకో, రాక్ష‌సి అని పిలిచే ప్ర‌య‌త్నం చేయ‌రు. కానీ బ‌య‌ట నుంచి వ‌చ్చేవాళ్ల‌ను, అందులోనూ చిన్న ప‌ట్ట‌ణాలు, సాధార‌ణ కుటుంబాల‌ నుంచి వ‌చ్చేవారిని మాత్రం ఇలాంటి పేర్లతో పిలుస్తూ వేధిస్తారు" అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. (కంగనా ఇంటి వద్ద కాల్పుల కలకలం)

మరిన్ని వార్తలు