పండగ మీద పండగ చేసుకోవాలి

31 Dec, 2022 00:54 IST|Sakshi
వివేక్, భీమ్స్, టీజీ విశ్వప్రసాద్, రవితేజ, శ్రీలీల, త్రినాథరావు

– రవితేజ

‘‘పండగ చేసుకుని రెండేళ్లయింది. మళ్లీ ఇప్పుడు పండగ (‘ధమాకా’ హిట్‌ని ఉద్దేశిస్తూ...). ఇకపై పండక్కి గ్యాప్‌ ఇవ్వొద్దు. పండగ మీద పండగ చేసుకోవాలి. మీ స΄ోర్ట్‌ (అభిమానులు, ప్రేక్షకులు) ఇలానే కొనసాగాలి’’ అని రవితేజ అన్నారు. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా హైదరాబాలో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ సినిమాకు దర్శకుడు త్రినాథరావు డ్రైవర్‌ అయితే.. నేను కండక్టర్‌ని (నవ్వుతూ..). ఈ సినిమా సక్సెస్‌కి కారణమైన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ధమాకా’ విజయం సమిష్టి కృషి’’ అన్నారు నక్కిన త్రినాథరావు. ‘‘రవితేజగారితో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. ‘‘ధమాకా’ విజయానికి ప్రధాన కారణం రవితేజ అన్న, ఆయన అభిమానులు’’ అన్నారు ఈ చిత్ర కథా రచయిత ప్రసన్నకుమార్‌ బెజవాడ. ఈ కార్యక్రమంలో కె. రాఘవేంద్రరావు, హరీష్‌ శంకర్, బండ్ల గణేష్, తేజా సజ్జా ΄ాల్గొని ‘ధమాకా’ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు