కార్తి సినిమాలో హీరోయిన్‌గా సీరియల్‌ నటి

25 Nov, 2023 06:52 IST|Sakshi

కోలీవుడ్‌ హీరో కార్తి ఇటీవల నటించిన జపాన్‌ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన వరుసగా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. అందులో కార్తి 26 చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. ఇందులో ఆయనకు జోడీగా నటి కీర్తిసురేష్‌ నటిస్తున్నారు.

కార్తి 27వ చిత్రం కూడా లైన్‌లో ఉంది. దీనికి 96 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మరో ప్రధాన పాత్రలో అరవింద్‌స్వామి నటిస్తున్నారు. ఇది కుటుంబ నేపథ్యంలో సాగే అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు.

కాగా ఇందులో నటుడు కార్తికి హీరోయిన్‌ ఉండదనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయనకు జోడీ ఉంటుందని సమాచారం. ఇంతకుముందు ఒక కన్నడ చిత్రంలో కథానాయకిగా నటించిన స్వాతి కొండెకు ఈ ఛాన్స్‌ దక్కినట్టు తెలుస్తోంది. ఆ సినిమా తరువాత అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై ఆమె దృష్టి సారించింది. తీరమాన రోజావే అనే సీరియల్‌లో ప్రధాన పాత్రతో మెప్పిస్తుంది. ఈ సీరియల్‌తో స్వాతి కొండె బాగా పాపులర్‌ అయ్యింది. అలా ఇప్పుడు మళ్లీ హీరోయిన్‌గా కార్తితో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు టాక్‌.

మరిన్ని వార్తలు