ప్రభాస్‌ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని సమాధానం

21 Jan, 2021 17:36 IST|Sakshi

టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్‌ ముందుంటారు. ఈ పాన్‌‌ ఇండియా స్టార్‌  పెళ్లికి సంబంధించి ఎప్పుడూ  పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. నిన్న (బుధవారం)  రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు ప్రభాస్‌ పెళ్లిపై  స్పందించారు.  ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా..ఎప్పుడు జరిగితే అప్పుడే అంటూ ఊహించని సమాధానం ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి గురించి మీ అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు జరుగుతుందో చూద్దాం అంటూ జావాబిచ్చారు. (వైరల్: పెదనాన్న జుట్టు సరి చేస్తున్న ప్రభాస్‌)

గతంలో ప్రభాస్‌ పెళ్లి గురించి ఎప్పుడు టాపిక్‌ వచ్చినా చాలా త్వరలోనే చేసేద్దాం అంటూ చెప్పే పెదనాన్న కృష్ణంరాజు ఇలాంటి ఆన్సర్‌ ఇవ్వడంతో అసలు ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడా లేక సింగిల్‌గానే మిగిలిపోతాడా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలో టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌ అయిన రానా, నితిన్, నిఖిల్‌ సహా పలువురు సెలబ్రెటీలు పెళ్లి చేసుకోగా, ప్రభాస్‌కి ఆ పెళ్లిభాగ్యం ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు