నన్ను నమ్మి తీరాల్సిందే: రియా చక్రవర్తి

28 May, 2021 12:46 IST|Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. నింగికేగిన ఈ నటుడిని అభిమానులు తల్చుకోని రోజంటూ ఉండదు. సైన్స్‌ గురించి మాట్లాడినా, స్పేస్‌(అంతరిక్షం) ప్రస్తావన తీసినా, ఇండస్ట్రీలో ఎవరైనా అణిచివేతకు గురయ్యారన్నా.. ఫ్యాన్స్‌కు ముందు సుశాంత్‌ పేరే తడుతుంది. అతడు అభిమానులను ఒంటరివాళ్లను చేస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్లి జూన్‌ 14 నాటికి సంవత్సరం పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా అతడి ప్రేయసి రియా చక్రవర్తి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే అంత గొప్ప బలం చేకూరుతుంది. ఈ విషయంలో మీరు నన్ను నమ్మి తీరాల్సిందే.. అక్కడే ఉండు, ప్రేమతో రియా..' అని రాసుకొచ్చింది.

కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గతేడాది ముంబైలో బాంద్రాలోని తన నివాసంలో జూన్‌ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో డ్రగ్స్‌ కోణం వెలుగు చూడటంతో విచారణ చేపట్టిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) అధికారులు సుశాంత్‌ ప్రేయసి రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని అరెస్ట్‌ చేశారు. సుమారు నెల రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత రియా బెయిల్‌ మీద బయటకు వచ్చింది. కానీ ఈ డ్రగ్స్‌ కేసుకు బీటౌన్‌లో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో పాటు సెలబ్రిటీలు దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్‌, ఫిరోజ్‌ నదియావాలా సహా పలువురి పేర్లు తెర మీదకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది.

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

చదవండి: రియాకు బెయిల్‌!: సుప్రీంకోర్టుకు ఎన్‌సీబీ

రియా కొత్త ఫొటో వైరల్‌.. మండిపడుతున్న నెటిజన్లు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు