తొలిసారి ఆ ప్ర‌య‌త్నం చేసిన స‌మంత‌

27 Aug, 2020 17:53 IST|Sakshi

లాక్‌డౌన్‌లో అంద‌రూ ఖాళీగా మారిపోతే స్టార్ హీరోయిన్‌, అక్కినేని కోడ‌లు స‌మంత మాత్రం బిజీగా మారిపోయారు. టెర్ర‌స్ గార్డెనింగ్ మొద‌లు పెట్టారు, వంట చేయ‌డం నేర్చుకున్నారు. అటు ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు త‌ప్ప‌నిస‌రిగా యోగా కూడా చేస్తున్నారు. తాజాగా ఆమె లాక్‌డౌన్‌కు ముందు న‌టించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌కు డ‌బ్బింగ్ చెప్తున్నారు. నిజానికి సినిమాల్లో ఆమె పాత్ర‌ల‌కే గాయ‌ని చిన్మ‌యి డ‌బ్బింగ్ చెప్తుంటారు. కానీ ఈ వెబ్ సిరీస్ కోసం స‌మంతే ప్ర‌త్యేకంగా డ‌బ్బింగ్ చెప్తుండ‌టం అభిమానుల‌కు సంతోషాన్నిచ్చే వార్త‌. తెలుగు, త‌మిళ భాష‌ల‌తో పాటు హిందీలోనూ స‌మంతే డ‌బ్బింగ్ చెప్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. (నా కుటుంబం కోటి)

ఈ సంద‌ర్భంగా డ‌బ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫొటో‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు. కానీ ఇందులో స‌మంత క‌న‌ప‌డ‌కుండా, మైక్రోఫోన్‌ను, ఎదురుగా టీవీలోని ఓ స‌న్నివేశాన్ని చూపించారు. ఇక‌ ఈ సిరీస్ అభిమానుల‌కు క్రేజీ అనుభ‌వాన్ని ఇవ్వ‌బోతుంద‌ని రాసుకొచ్చారు. కాగా రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు రూపొందిస్తున్న‌ ఫ్యామిలీ మ్యాన్ 2 త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అవ‌నుంది. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఇది ప్ర‌సారం కానుంది. ఇందులో స‌మంత టెర్రరిస్టుగా క‌నిపించ‌నుంద‌ని సమాచారం. ఈ సిరీస్‌లో బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ భాజ్‌పాయ్‌తో పాటు హీరోయిన్ ప్రియ‌మ‌ణి కూడా న‌టిస్తున్నారు. (‘అమృత ప్రేమలో విరాట్.. మనసులో మాట’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా