గెట్‌ రెడీ ఫర్‌ మహేశ్‌బాబు బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌ ​ రెడీ

19 Jul, 2021 07:51 IST|Sakshi

రాత్రి వేళ ‘సర్కారువారి పాట’ జరుగుతోంది. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ఇందులో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దుబాయ్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసిన ఈ చిత్రయూనిట్‌ ఇటీవల హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ చిత్రీకరణను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా నైట్‌ షూట్‌ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ మరో వారానికిపైగా హైదరాబాద్‌లోనే జరుగుతుందట. అలాగే  ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్‌ డే సందర్భంగా ‘సర్కారువారిపాట’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల కానుందనే టాక్‌ వినిపిస్తోంది.  మరి.. తన బర్త్‌డేకి ఫస్ట్‌ లుక్‌తో అభిమానులను మహేశ్‌ సర్‌ప్రైజ్‌ చేస్తారా? వేచి చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు