జైలర్‌తో పోరాటం!

18 Nov, 2022 05:42 IST|Sakshi

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్‌’. ఇందులో రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్‌ రవి, వినాయకన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కొన్ని రోజులుగా చెన్నైలో జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌. ఈ చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్, శివరాజ్‌కుమార్‌ కాంబినేషన్‌లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది.   

మరిన్ని వార్తలు