-
Pawan Kalyan: అక్కడ బ్రేక్ వేస్తే..ఇక్కడ చిక్కే!
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా హీరో శివరాజ్‌కుమార్ కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు. శివరాజ్ కుమార్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ పెంచుకోవాలనుకున్న కాంగ్రెస్ స్పీడ్‌కు కర్ణాటక బీజేపీ బ్రేకులు వేసే పనిలో ఉంది. శివరాజ్ కుమార్ టార్గెట్‌గా కన్నడ చిత్రపరిశ్రమలో ఆయనకు సంబంధించిన సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్స్‌ను ఎక్కడా కనిపించకుండా నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కర్ణాటక బీజేపీ ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగులను ప్రదర్శించకుండా ఆదేశించాలని బీజేపీ తాజాగా కోరింది. బీజేపీ ఫిర్యాదును అక్కడి ఎన్నికల కమిషన్ అమలు చేస్తే ఏపీలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన సినిమాలు, టీజర్లు, ట్రైలర్లు, ప్రకటనలు వంటి వాటిని కూడా నిషేధించాల్సి వస్తుంది. కన్నడలో శివరాజ్ కుమార్ కూడా పాపులర్ హీరో.. ఆయన గురించి బీజేపీ ఎలాంటి ఫిర్యాదు చేసిందో ఇప్పుడు ఏపీలో కూడా అవన్నీ పవన్‌కు వర్తిస్తాయి అనేది పాయింట్. -
మెగాస్టార్‌ను కలిసిన శివన్న.. చిరు ఇంట్లో భోజనం..
సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. దీంతో చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనను ఇంటికి వెళ్లి మరీ అభినందించారు. ఈ క్రమంలో చిరంజీవి.. రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేక విందు పార్టీ ఇచ్చాడు. ఇకపోతే ఈ రోజు(ఫిబ్రవరి 4న) తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని సన్మానించింది. ఆయనతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న అందరినీ ఘనంగా సత్కరించింది. ఆత్మీయంగా కలిసి మరీ.. తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మెగాస్టార్‌ను అభినందించాడు. ఫోన్లోనో, సోషల్ మీడియాలోనో కాదు.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి మరీ చిరంజీవిని ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించాడు. 'ప్రియమైన స్నేహితుడు శివన్న నా కోసం ఇక్కడివరకు రావడం చాలా సంతోషం. ఆయన చేసిన పనికి ఉప్పొంగిపోయాను. మెగాస్టార్‌తో శివన్న లంచ్ మేమిద్దరం కలిసి భోజనం చేశాం, చాలాసేపు కబుర్లాడుకున్నాం. లెజెండరీ నటుడు రాజ్ కుమార్‌తో ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాం. ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం' అని కాస్త ఎమోషనలయ్యాడు. శివన్నతో కలిసి భోజనం చేసిన ఫోటోలను సైతం ట్వీట్ చేశాడు. ఇది చూసిన జనాలు ఖుషీ అవుతున్నారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Very touched that my dear @NimmaShivanna came all the way from Bangalore to congratulate me 🤗 Spent some wonderful time over lunch and fondly recalled our association and so many cherished memories with the Legendary Rajkumar garu and his entire family.🙏 Delighted. pic.twitter.com/gbWizevDso — Chiranjeevi Konidela (@KChiruTweets) February 4, 2024 చదవండి: హనీమూన్ పిక్స్ షేర్ చేసిన స్టార్ హీరో కూతురు.. అక్కడ కూడా యోగా వదల్లేదు! -
శివరాజ్ కుమార్‌తో ‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ!
"సప్త సాగరాలు దాటి" సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు. 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు. కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు సమాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. -
Captain Miller HD Stills: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ స్టిల్స్
-
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో మొదలవుతుంది ‘యుఐ’ చిత్రం టీజర్. ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుఐ’. జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహనిర్మాత. బందీలుగా ఉన్నవారి హాహాకారాలు, విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు కనిపిస్తుండగా, వారిని రక్షించడానికే అన్నట్లు హీరో ఉపేంద్ర ఎంట్రీతో టీజర్ ముగుస్తుంది. సోమవారం జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఈ చిత్రానికి ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ (ఐఎల్ఎమ్) క్రియేషన్ టెక్నాలజీని వాడాం. దాదాపు 90 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర సరసన రీష్మా నానయ్య నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమెరా: హెచ్‌సి వేణుగోపాల్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement