Sonam Kapoor: సోనమ్‌ కపూర్‌ ఇంట్లో దొంగతనం.. కోట్ల విలువైన నగలు మాయం

9 Apr, 2022 14:20 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ ఇంట్లో దొంగతనం జరిగింది. న్యూఢిల్లీలోని ఆమె నివాసంలోకి చొరబడ్డ దుండగులు సుమారు రూ.1.41 కోట్ల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఫిబ్రవి 23న జరగగా,హై ప్రొఫైల్‌ కేసు కావడంతో పోలీసులు దీన్ని గోప్యంగా ఉంచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోసం స్పెషల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

సోనమ్‌ ఇంట్లో పనిచేస్తున్న 25మంది ఉద్యోగులతో పాటు 9మంది కేర్‌టేకర్స్‌, డ్రైవర్లు, తోటమాలి, ఇతర పనివాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీని సైతం పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఇంట్లో సోనమ్‌ భర్త ఆనంద్‌ అహుజా పేరేంట్స్‌తో పాటు అతని నానామ్మ సరళ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు.

దొంగతనం అనంతరం ఒక రోజు అల్మారాలోని నగలు, డబ్బు తనిఖీ చేసినప్పుడు చోరీ జరిగిందన్న విషయం తెలిసిందని ఆమె పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మరోవైపు గర్భవతిగా ఉన్న సోనమ్‌ ప్రస్తుతం తల్లి దగ్గర ఉంటున్నట్లు తెలుస్తుంది. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సోనమ్‌ ఇటీవలె  బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు