కళ్లకు గంతలు కట్టుకుని మరీ..

23 Jan, 2021 09:43 IST|Sakshi

‘చూపు ఉన్నవాళ్లు చూడలేనివాళ్లలా నటించడం అనుకున్నంత సులువు కాదు. అందుకే నా కొత్త చిత్రం కోసం కళ్లకు గంతలు కట్టుకుని సాధన చేస్తున్నాను’ అన్నారు సోనమ్‌ కపూర్‌. హిందీ చిత్రం ‘బ్లైండ్‌’లో సోనమ్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో చూపులేని పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారామె. ఈ పాత్రను బాగా చేయడానికి చూపులేనివాళ్లను గమనిస్తున్నారట సోనమ్‌. అలానే ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు గంతలు కట్టుకుని ఒకసారి, మామూలుగా ఓసారి నటించి చూసి అందులో వ్యత్యాసాలను గమనిస్తున్నారట. అలానే ఈ పాత్ర కోసం ఓ కోచ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు సోనమ్‌. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్‌గో ప్రాంతంలో జరుగుతోంది. షోమే మక్జీ దర్శకత్వంలో ఈ సినిమాను సుజోయ్‌ ఘోష్‌ నిర్మిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు