నాన్న ఆహారం తీసుకుంటున్నారు: ఎస్పీ చరణ్‌

20 Sep, 2020 12:50 IST|Sakshi

చెన్నై: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ' ఆరోగ్యం నిలకడగగా ఉంది. నాన్న ఇప్పుడిప్పుడే ఆహారం తీసుకుంటున్నారు. అయితే ఇంకా వెంటిలేటర్‌ మీదే ఉన్నారు. ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, శక్తి మరింత మెరుగుపడాల్సిన ఉంది. మిగలిన వ్యవస్థలన్నీ సాధారణంగా ఉన్నాయి. ఎటువంటి ఇన్‌ఫెక్షన్ లేదు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ చేస్తున్నారు.  (ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు)

ఆస్పత్రి సిబ్బంది సహాయంతో రోజూ 15-20 నిమిషాలు లేచి కూర్చుంటున్నారు. శుక్రవారం నుంచి ఆహారం తీసుకుంటుండటంతో ఆయన మరింత వేగంగా కోలుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నా తండ్రికి, కుటుంబ సభ్యులకు ఎంతో సహకరించిన ఎంజీఎం హెల్త్‌కేర్‌లోని వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అయితే ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆగస్టు 5నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.  (నాన్న ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది)

మరిన్ని వార్తలు