వ్యాక్సిన్‌ పేరుతో సురేష్‌బాబుకు టోకరా.. నిందితుడు అరెస్ట్‌

23 Jun, 2021 13:27 IST|Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబును మోసం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వ్యాక్సిన్‌ టీకాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడిన నాగార్జున రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాక్సిన్‌ పేరుతో ఇప్పటి వరకు 10 మంది ప్రముఖులను మోసం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఓ మంత్రి పేరుతో కూడా నాగార్జునరెడ్డి మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

కాగా, కరోనా టీకాలు ఇప్పిస్తానని నమ్మబలికిన నాగార్జున రెడ్డి.. సురేష్‌ బాబు మేనేజర్‌ నుంచి లక్ష రూపాయలు అకౌంట్‌లో వేయించుకున్నాడు. అయితే, నగదు డ్రా చేసుకున్న తర్వాత నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ క్రమంలో మోసపోయినట్లు గ్రహించిన సురేష్ బాబు మేనేజర్‌ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
చదవండి:
నిర్మాత సురేష్‌ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు

మరిన్ని వార్తలు