Rashmi Rocket మరో పవర్‌ఫుల్‌ పాత్రలో తాప్సీ పన్ను

24 Sep, 2021 13:40 IST|Sakshi

తాప్సీ పన్ను తాజా బాలీవుడ్‌ చిత్రం ‘రష్మీ రాకేట్‌’. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం అవమానాలు ఎదుర్కొన్న కొంత మంది అథ్లెట్ల జీవితాల స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఆకర్ష్ ఖురానా. 

ఇందులో తాప్సీ అథ్లెట్‌గా అద‌ర‌గొట్టింది. రోనీ స్క్రూవాలా, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ పాత్రలో తాప్సీ కనిపించనుంది. సమాజం ముందు దోషిగా నిలబడిన రష్మీ హ్యుమన్ రైట్స్‌ని ఆశ్రయించి ఎలాంటి పోరాటం చేసింది, తిరిగి తన కలని ఎలా నిజం చేసుకుందనేదే ఈ కథ.

మరిన్ని వార్తలు