బ్రేకప్‌లు, విడాకుల తర్వాత కూడా దూసుకెళ్తున్న స్టార్‌ హీరోయిన్స్‌

20 Nov, 2021 18:23 IST|Sakshi

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్స్‌గా చక్రం తిప్పుతున్న మన తెలుగు హీరోయిన్స్‌ కొందరూ నిజ జీవితంలో చేదు అనుభవాలను చూశారు. అయినా కేరీర్‌ పరంగా వారు పరిశ్రమలో దూసుకుపోతున్నారు. కొందరు ప్రేమ వరకు వెళ్లి విడిపోయారు, మరికొందరు వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు, ఇంకొంత మంది నిశ్చితార్థం వరకు వెళ్లి బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇలా ఈ బాధలో కూడా వారు సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసి కేరీర్‌ పరంగా ఫుల్‌ బిజీ అవ్వడమే కాదు అంతకు ముందున్న సక్సెస్‌ కంటే కూడా డబుల్‌ సక్సెస్‌ను అందుకుంటున్నారు.  వారెవరో కాదు పరిశ్రమలో అత్యంత క్రేజ్‌ ఉన్న మన స్టార్‌ హీరయిన్స్‌. మరి వారెవరో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి.  

సమంత
అక్కినేని వారసుడు నాగచైతన్యతో ‘ఏం మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత చైతో పరిచయం, ప్రేమ, పెళ్లి, విడాకులు అంతా పదేళ్లలో జరిగిపోయింది. ఈక్రమంలో ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ కమర్షియల్‌ హిట్‌లు అందుకుంది. 2017లో చైతో వివాహం అనంతరం సినిమాల పరంగా కాస్తా ఆచితూచి అడుగులేస్తూ డిసెంట్‌ క్యారెకర్లు మాత్రమే ఎంచుకుంది. అయినా సామ్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ఇటీవల చైతో విడాకులు ప్రకటించిన సామ్‌ సినీ కేరీర్‌కు ఇంకా బ్రేక్‌ పడుతుందని అందరూ భావించారు.

కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుస ప్రాజెక్ట్స్‌ సంతకం చేస్తోంది. ఇటీవల శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్‌ చేసుకుంది. ప్రస్తుతం  తమిళంలో విజయ్‌ సేతుపతితో  ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అంతేగాక ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కూడా చేయబోతుందని వినికిడి. బ్రేకప్‌ అనంతరం ఆమె కెరీర్‌ ముగిసిందని అనుకుంటుండగా సామ్‌ జాతీయ స్థాయిని మించి ఏకంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇవే కాక కొత్తగా ఆమె ఐటెం సాంగ్‌తో సత్తా చాటుబోతోన్న సంగతి తెలిసిందే.  అంటే విడాకులు ఆనంతరం సామ్‌ మునుపటి కంటే మరింత బిజీగా మారిపోయింది. 

నయన తార
నయన తార పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆడదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె తమిళ శింబు సినిమా సమయంలో ఈ మూవీ హీరో శింబుతోతో ప్రేమయాణం నడిపింది. అది బ్రేకప్‌ తర్వాత కాస్తా సినిమాల స్పీడ్‌ పెంచిన నయన్‌ మెగి, లక్ష్మి వంటి  సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో కొరియోగ్రఫర్‌, నటుడు ప్రభుదేవాతో సీక్రెట్‌ రిలేషన్‌లో ఉంది. పెళ్లి వరకు వెళ్లిన వారి ఎఫైర్‌ మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ సమయంలో నయన్‌కు పెద్దగా హిట్‌లు లేవు.

ప్రభుదేవతో కట్‌ అయ్యాక పూర్తిగా సినిమాలపై ఫోకస్‌ పెట్టిన నయన్‌ లేడి ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వరుస హిట్‌ అందుకుంటూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. ఈ క్రమంలో దక్షిణాన అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా నయన్‌ పేరు తెచ్చుకుంది. ఇది మాత్రమే కాదు ప్రభుదేవతో బ్రేకప్‌ అనంతరం ఆమె లేడి సూపర్‌ స్టార్‌గా పిలుపించుకుంటుంది. కొంతకాలంగా తమిళ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న నయన్‌ త్వరలోనే అతడినే పెళ్లి చేసుకోబోతోంది. 

రష్మిక మందన్నా 
రష్మిక మందన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌గా మాత్రమే కాదు నేషనల్‌ క్రష్‌, మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌గా రష్మిక రికార్డులను సొంతం చేసుకుంది. వరుస హిట్లతో తెలుగు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక ఫుల్‌ బిజీ అయిపోయింది. తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్‌లోను తన సత్తా చాటుతోంది.

పరిశ్రమలో అడుగు పెట్టిన తక్కవు కాలంలోనే రష్మిక ఎంతో పాపులారిటి తెచ్చుకుంది. అయితే కన్నడ సినిమాతో అరంగేట్రం చేసిన రష్మిక శాండల్‌వుడ్‌ నిర్మాత, నటుడు రక్షిత్‌ శెట్టిని నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నిశ్చితార్థం బ్రేక్‌ చేసుకుంది. అనంతరం తెలుగు హాలో మూవీతో తెలుగులో అడుగు పెట్టిన రష్మిక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్రేకప్‌ అనంతరం కేరీర్‌పై ఫోకస్‌ పెట్టిన ఆమెకు వరుస విజయాలు వరించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగులో ఫుల్‌ బిజీ హీరోయిన్‌గా మారింది. 

మెహ్రీరిన్‌ కౌర్‌
‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచమైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్‌ కౌర్‌ ఫిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, కవచం, చాణక్య, ఎఫ్‌2 వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకుంది. వరుస ఆఫర్స్‌తో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో రహస్యంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న మెహ్రీన్‌ పెళ్లి వరకు వెళ్లింది.

ఏమైందో ఏమో తెలియదు కానీ తనతో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నట్లు ప్రకటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా మెహ్రీన్‌.. బ్రేకప్‌ అనంతరం వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తోంది.

అంతేగాక మునుపటి కంటే ఇప్కుడే మరింత బిజీ అయిపోయింది. అంతేగాక ఈ మధ్య సినిమా అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటు వస్తున్నాయి. చెప్పాలంటే బ్రేకప్‌ మెహ్రీన్‌గా కలిసోచ్చినట్లు కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం ఆమె చేతిలో ఎఫ్‌ 3 మూవీతో పాటు మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.

 

త్రిష 
ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గానే కొనసాగుతుంది త్రిష. అయితే స్టాలిన్‌ అనంతరం తెలుగులో సినిమా అవకాశాలు తగ్గడంతో నటనకు గ్యాప్‌ ఇచ్చిన ఆమె ఆ మధ్య వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్‌మణిమన్‌ను నిశ్చితార్థం చేసుకుంది. ఏమైందో ఆమె పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుంది.

ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిన త్రిష సెకండ్‌ తమిళ చిత్రం 96తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో అవకాశాలు తక్కువే అయినప్పటికీ తమిళంలో మాత్రం ఫుల్‌ బిజీగా మారిపోయింది. లేడి ఓరియెంట్‌, పాత్ర ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. 

శ్రుతీ హాసన్‌
విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నట వారసురాలికి పరిశ్రమలో అడుగు పెట్టింది. శ్రుతి. కెరీర్‌ ప్రారంభంలో ఆమెకు పెద్ద విజయాలు లేవు. ఒకానోక సమయంలో ఐరన్‌ లెగ్గ్‌ అనే ముద్ర కూడా ఆమెకై పడింది. అయితే గబ్బర్‌ సింగ్‌ మూవీతో తోలి హిట్‌ అందుకుంది. ఆ తర్వాత శ్రుతి వెనక్కి తిరిగి చూడలేదు. వరుస విజయాలు ఉన్నప్పటికి సినిమాలు మాత్రం చాలా తక్కువగా చేసేది. ఆ మధ్య మైఖెల్‌ కోర్సలేతో ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో కెరీర్‌ను కాస్తా పక్కన పెట్టింది.

ఇక అతడితో బ్రేకప్‌ అనంతరం గ్యాప్‌ తీసుకుని సెకండ్‌ ఇన్నింగ్‌ స్టార్ట్‌ చేసిన శ్రుతి వరుస ప్రాజెక్ట్స్‌ దూసుకుపోతోంది. ప్రభాస్‌ సలార్‌ వంటి పాన్‌ ఇండియా సినిమాతో పాటు బాలయ్యతో ఓ సినిమాకు సంతకం చేసింది. అంతేగాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇలా బ్రేకప్‌ తర్వాత శ్రుతి మరింత పుంజుకుని సినిమాల పరంగా ఫుల్‌ బిజీ మారింది. ప్రస్తుతం ఆమె డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో ప్రేమలో మునిగి తేలుతోంది. 

>
మరిన్ని వార్తలు