ఇండస్ట్రీలో వారసత్వం.. మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు కామెంట్స్

9 Dec, 2023 17:18 IST|Sakshi

తెలుగు, తమిళంలో చాలా హిట్ సినిమాలకు సంగీతమందించి గుర్తింపు తెచ్చుకున్నారు విద్యాసాగర్. రజనీకాంత్‌ 'చంద్రముఖి'తో పాటు తమిళంలో పరవైగళ్‌ పలు విధం, పూమగళ్‌, జైహింద్‌, ధూల్‌ రన్‌, దిల్‌, తులసీ ఇలా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 'తిరుట్టుపయలే–2' తర్వాత మరో మూవీ చేయలేదు. అయితే విద్యాసాగర్‌ వారసుడు హర్షవర్ధన్‌ తండ్రి బాటలో పయనిస్తూ ఆయనలా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!)

ప్రస్తుతం ఏఆర్‌ రెహమాన్‌, జీవీ ప్రకాష్‌కుమార్‌, తమన్.. తదితర సంగీత దర్శకుల దగ్గర విష్ణువర్దన్.. మ్యూజిక్‌ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. తండ్రి విద్యాసాగర్‌కు చిత్రపరిశ్రమలోగానీ అభిమానుల్లో గానీ తగిన గుర్తింపు రాలేదని విష్ణువర్ధన్ అన్నారు. ఆయనలోని సంగీతాన్ని చిత్ర పరిశ్రమ సరిగా వాడుకోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఆయనలా పేరు తెచ్చుకోవడానికి కృషిచేస్తున్నానని అన్నారు. 

అలాగని ఎక్కడా తన తండ్రి పేరును వాడుకోవడం లేదన్నారు. సొంత ప్రతిభ కృషితోనే ఈ రంగంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. తన గురించి తెలిసిన వాళ్లు కొందరు విద్యాసాగర్‌ కుమారుడు అని ముందుగా ఎందుకు చెప్పలేదని అడుగుతుంటారన్నారు. అలా చెప్పుకోవడం ఇష్టం లేదని విష్ణువర్ధన్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు)

>
మరిన్ని వార్తలు