కాబోయే భార్య బయోపిక్‌ తీస్తాను: హీరో

23 Mar, 2021 09:29 IST|Sakshi

తమిళ సినిమా: ప్రముఖ బ్యాడ్మింటన్‌ గుత్తా జ్వాల జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని యువ నటుడు విష్ణు విశాల్‌ తెలిపారు. కోలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌ హీరోగా రాణిస్తున్న ఈయన తాజాగా నటించిన చిత్రాల్లో కాడన్‌ చిత్రం ఒకటి. పాన్‌ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం ఈనెల 26వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్‌ సోమవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఈ ఏడాది తాను నటించిన 4 చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయని తెలిపారు. అందులో తాను సొంతంగా నిర్మించి, కథానాయకుడిగా నటిస్తున్న ఎఫ్‌ఐఆర్, మోహన్‌ దాస్‌ చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు.

అదేవిధంగా త్వరలోనే ప్రముఖ బ్యాడ్మింటన్‌ గుత్తా జ్వాలాను పెళ్లాడబోతున్నట్లు తెలిపారు. ఇది ప్రేమ వివాహం కాదన్నారు. ఇంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందన్నారు. అందు వల్ల తాను, జ్వాలా ఒకరికొకరం అర్థం చేసుకుని గౌరవించుకుని చేసుకుంటున్న పెళ్లి ఇది అని చెప్పారు. గుత్తా జ్వాలా ఒలింపిక్‌లో పాల్గొన్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి అన్న విషయం తెలిసిందేన్నారు. ఆమె తన గురించి పలు అనుభవాలను తనతో పంచుకున్నారని, ఆమె బయోపిక్ను చిత్రంగా నిర్మించాలని ఆలోచన తనకు ఉందని పేర్కొన్నారు. కాడన్‌ చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు.

చదవండి:
తెరపైకి గుమ్మడి నర్సయ్య బయోపిక్.. 

అడవిలోనే 25 ఏళ్లు..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు