రాజన్నసేవలో ఎమ్మెల్యే దంపతులు

25 Dec, 2023 01:32 IST|Sakshi

వేములవాడ: వేములవాడ రాజన్నను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం పర్యవేక్షకులు తిరుపతిరావు స్వామి వారి ప్రసాదాలు అందించి సత్కరించారు.

నేడు మంత్రి శ్రీధర్‌బాబు రాక

కాటారం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేడు(సోమవారం) కాటారం రానున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి మండలానికి వస్తుండటంతో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా గంగారం క్రాస్‌ రోడ్డు నుంచి కాటారం ప్రధాన కూడలి వరకు శ్రీధర్‌బాబు కు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కాటారం ప్రధాన కూడలిలో నిర్వహించే రోడ్‌ షోలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించనున్నట్లు తెలిపారు.

బేగ్లూర్‌ మల్లికార్జున స్వామి జాతర

మహదేవపూర్‌: మండలంలోని బేగ్లూర్‌ గ్రామంలో వెలిసిన మల్లన్న దేవుడి బోనాలు మొదటిరోజు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మల్లన్న ఉత్సవ విగ్రహాలకు గోదావరిలో స్నానాలు చేయించి లక్ష్మి దేవరతో ఊరేగింపు చేసి గుడిలో ప్రతిష్ఠించారు. ఒగ్గు పూజార్లు పూజలు నిర్వహించి పట్నాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు పూజారి గురువయ్య, సర్పంచ్‌ రాజక్క, ఎంపీటీసీ చల్ల పద్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కొనసాగుతున్న అన్నదానం

కాటారం: మండలకేంద్రంలోని శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలధారణ స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం కాటారం సీఐ రంజిత్‌కుమార్‌, గురుస్వామి పిచర రామకృష్ణారావు, ఆదర్శ పాఠశాల కరస్పాండెంట్‌ జనగామ కార్తీక్‌రావు, జక్కిలేటి అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అంతకముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. స్వామి వారికి పడి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు బచ్చు అశోక్‌గుప్త, కమిటీ అధ్యక్షుడు బచ్చు ప్రకాశ్‌, గురుస్వాములు బొమ్మ ప్రభాకర్‌, చీమల రాజు, అయిత వెంకన్న, ముస్కమల్ల సత్యం, చీమల శ్రీనివాస్‌, మల్లేశ్‌ పాల్గొన్నారు.

జాతర నూతన కమిటీ ఎన్నిక

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మండలం గుర్రంపేట సమ్మక్క సారలమ్మ జాతర నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కమిటీని ప్రకటించారు. చైర్మన్‌గా కొండపర్తి సారంగపాణి, వైస్‌ చైర్మన్‌లుగా మామిండ్ల రాజు, బొట్ల రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా కొర్ర రాజేందర్‌, డైరెక్టర్స్‌గా ఆంగోత్‌ సంపత్‌ నాయక్‌, మామిడి నరసింహ రాములు, దూడపాక అరవింద్‌, కన్నం మహేందర్‌, ఏదులం కుమారస్వామి, గందల విజేందర్‌, అంబీర్‌ సంపత్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు, ఉమ్మడి గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్‌సభ్యులు, నాయక్‌ పోడు సంఘం సభ్యులు, మాజీ చైర్మన్లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు