పల్లెల్లో పదనిసలు

26 Nov, 2023 01:40 IST|Sakshi

అచ్చంపేట: అసలే వ్యవసాయంలో కీలకమైన కాలం.. చేతికొచ్చిన పత్తి తీత, వరి కోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే ఎన్నికలు రావడంతో వ్యవసాయ పనులు ప్రచారానికి పెద్ద అడ్డంకిగా మారాయి. నాయకులు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు ప్రచారానికి వెళ్లిన గ్రామాల్లో ఒక్కరు కూడా కనబడటం లేదు. గత మూడు వారాల నుంచి నేతల విస్తృతంగా ప్రచారంలో పొల్గొంటున్నారు. ఇదే సమయంలో పత్తితీయడం, వరికోతలు వంటి పనుల్లో వ్యవసాయదారులు, కూలీలు నిమగ్నమై ఉంటున్నారు. ఫలితంగా మధ్యాహ్నం గ్రామాల్లో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. నేతలు తమ ప్రచారాన్ని ఉదయం పది గంటలకు ముందు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొనసాగించే పరిస్థితి నెలకొంది. మొత్తంగా పల్లెల్లో విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇటు వ్యవసాయ పనులు.. అటు ఎన్నికల ప్రచారం

జోరుగా సాగుతున్నఆయా కార్యక్రమాలు

ఉదయం.. రాత్రి సమయాల్లో కలుస్తూ ఓట్ల అభ్యర్థన

గ్రామాల్లో మధ్యాహ్నం వేళ నిశబ్ద వాతావరణం

బహిరంగ సభలకుజనసమీకరణ చేయలేక నాయకుల పాట్లు

మరిన్ని వార్తలు