ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వర్తించాలి

26 Nov, 2023 01:40 IST|Sakshi

నారాయణపేట: బాధ్యతతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని నారాయణపేట సాధారణ ఎన్నికల పరిశీలకుడు బీపీ చౌహాన్‌, పోలీసు పరిశీలకుడు బీఎస్‌ ధ్రువ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మక్తల్‌ నియోజకవర్గ ఎస్‌హెచ్‌ఓలు, సెక్టోరియల్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. పోలింగ్‌ అనంతరం వాహనాలను ఎక్కడ నిలపకుండా రిసెప్షన్‌ సెంటర్‌కు తీసుకురావాలన్నారు. మూడోవిడత ర్యాండమైజేషన్‌ నిర్వహిస్తామని తెలిపారు. 29వ తేదీ రాత్రి పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్‌ కేంద్రాల్లోనే ఉండాలని, 30న ఉదయం 5.30 గంటలకు మాక్‌పోల్‌ నిర్వహించాలని సూచించారు. ఎస్‌ఓలు పోలింగ్‌ స్టేషన్లు పర్యవేక్షించాలని.. ప్రతి రెండు గంటలకు ఓసారి పోలింగ్‌ శాతాన్ని సెక్టోరియల్‌ అధికారికి పంపితే అక్కడ నుంచి రిటర్నింగ్‌ అధికారికి పంపాలన్నారు. సెక్టోరియల్‌ అధికారికి రిజర్వు ఈవీఎం ఇస్తారని తెలిపారు. రిసెప్షన్‌ సెంటర్‌లో అన్నిరకాల నివేదికలు సమర్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌, సెక్టోరియల్‌ అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

సాధారణ ఎన్నికల పరిశీలకుడుబీపీ చౌహాన్‌

మరిన్ని వార్తలు