పారాగ్లైడింగ్‌ చేస్తుండగా.. సరిగా ఓపెన్‌ కాకపోవడంతో విషాదం

25 Dec, 2022 19:19 IST|Sakshi

ఒక వ్యక్తి పారాగ్లైడింగ్‌ చేస్తుండగా సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో విసత్‌పురా గ్రామంలోని పాఠశాలలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల షిన్‌ బైయాంగ్‌ మూన్‌ గుజరాత్‌లోని కడి పట్టణంలో పారాగ్లైడింగ్‌ చేస్తుండగా.. పారాగ్లైడర్‌ కనోపి సరిగా తెరుచుకోవడంలో విఫలమైంది.

అంతే అతను ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి బ్యాలెన్స్‌ కోల్పోయాడు. దీంతో అతను దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటినా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వ్యక్తి పడిపోతున్నానన్న షాక్‌లో గుండెపోటుకి గురవ్వడంతో మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఆ కోరియన్‌ గుజరాత్‌లోని వదోదర పర్యటనలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

శనివారం సాయంత్రం సదరు కొరియన్‌ షిన్‌, అతని స్నేహితుడితో కలిసి పారాగ్లైడింగ్‌కి వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి కొరియన్‌ ఎంబసీకి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని అతడి స్వదేశానికి పంపే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 

(చదవండి: క్రిస్మస్‌ చెట్టుకు బైడెన్‌ దంపతుల అలంకరణ.. ఫోటో వైరల్‌)

మరిన్ని వార్తలు